![]() |
![]() |
.webp)
హ్యాండ్సమ్ హీరో కనిపిస్తే ఎవరైనా ఆగుతారా... వెళ్ళిపోయి వాళ్ళ ఒళ్ళో వాలిపోతారు హీరోయిన్స్. కానీ ఇక్కడ దర్శిని గౌడా మాత్రం పాపం భయపడిపోయింది. నీతోనే డాన్స్ సీజన్ 2 ఫుల్ ఎంటర్టైనింగ్ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో దూసుకుపోతోంది. ఇక ఆదివారం ఎపిసోడ్ ఒక చిన్న ఇంటరెస్టింగ్ సన్నివేశం జరిగింది. యావర్ - వాసంతి కృష్ణన్ డాన్స్ ఐపోయాక నాగ పంచమి సీరియల్ హీరో హీరోయిన్స్ ప్రిద్వి శెట్టి- దర్శిని గౌడ మార్క్స్ ఇచ్చి డాన్స్ చాలా బాగుంది అనేసరికి వెళ్ళు యావర్ వెళ్లి హగ్ చేసుకో ప్రిద్విని అని పంపింది. తర్వాత వాసంతిని హగ్ చేసుకుంటావా అని ప్రిద్విని అడిగింది. "నో నాకు పెళ్లయ్యింది" అని వాసంతి తప్పించుకుంది.
తర్వాత దర్శినిని చూస్తూ నువ్వు కూడా యావర్ ని హగ్ చేసుకోవాలనుందా అంటూ వెళ్లి స్టేజి మీదకు తీసుకొచ్చి మరి యావర్ కి అప్పజెప్పింది. ఇంకేముంది అసలే కండల వీరుడు. ఇక రెండు చేతుల్లో ఎత్తుకుని గిరగిరా తిప్పేసాడు. యావర్ అలా గాల్లో తిప్పుతుంటే దర్శిని కింద పడిపోతుందా అనిపించింది. తర్వాత మోకాలి మీద అలా కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత ఇక దర్శిని వెళ్తూ వెళ్తూ థ్యాంక్యూ అన్నయ్యా అన్నది. అంతే శ్రీముఖి గట్టిగా జారీచేసింది. మరో పక్క ప్రిద్వి శెట్టి మాత్రం వెళ్లొద్దు, వెళ్లొద్దు అని మైండ్ వాష్ చేసాడు ఎంత పోసిసివ్ రా బాబు అంటూ కామెంట్ చేసింది శ్రీముఖి. ఇక పంచమి సీరియల్ హీరో హీరోయిన్స్ ఇద్దరురో ప్రేమలు ఉన్న విషయం తెలిసిందే. ఐతే పెళ్ళెప్పుడు అవుతుంది అని షో స్టార్టింగ్ లో అడిగింది శ్రీముఖి. నీతోనే డాన్స్ టైటిల్ విన్ ఐతే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు పృద్వి..దాంతో శ్రీముఖి మీ పెళ్లి కోసం ఐనా కూడా టైటిల్ విన్ అయ్యేలా చేస్తా అంటూ ప్రామిస్ చేసింది. మరి టైటిల్ విన్ అవుతాడా...పెళ్లి చేసుకుంటాడా చూద్దాం..
![]() |
![]() |